ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఎస్ఓలను భయపెట్టి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానల్స్‌ను అనధికారికంగా నిలిపివేయించిన జగన్ ప్రభుత్వానికి శృంగభంగం తప్పదని, ఇది న్యాయ నిపుణులే చెబుతున్నారని అంటున్నారు అడ్వకేట్ తేజావర్మ.
2014లో అప్పుడే అధికారంలోకి వచ్చిన తెలంగాణా రాష్ట్ర సమితి నేత చంద్రశేఖరరావు ప్రభుత్వం ఇలానే ఎంఎస్ఓలను భయపెట్టి టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్స్‌ను అపించారు. టీవీ9 ఛానల్ ఢిల్లీలోని TDSAT ట్రిబ్యునల్‌కు వెళ్లి 90 రోజుల తర్వాత ఆర్డర్ తెచ్చుకుంది. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం మొండికేసి టీవీ9 ఛానల్ ప్రసారాలు ఇవ్వడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద చంద్రశేఖరరావు ప్రభుత్వంపైన పిటిషన్ దాఖలు అయ్యాక భయపడి దారికి వచ్చింది. తర్వాత మూడు నెలలకు టీవీ9 ఛానల్ ప్రసారాలు యధావిధిగా మొదలయ్యాయి. హైకోర్టుకు వెళ్ళిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఆర్డర్ రాకపోవడంతో, డివిజినల్ బెంచ్‌కు వెళ్ళింది. అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు టీవీ9 ఛానల్ కేసు విషయంలో TDSAT ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. ప్రోగ్రాం కోడ్ 1994లోని 6, 7 నియమ నిబంధనలు పాటించినంత కాలం వాక్ స్వాతంత్రాన్ని హరించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు 500 రోజుల తర్వాత పునరుద్ధరణ అయ్యాయి. ఆ తీర్పు ప్రకారం చూస్తే ఇప్పుడు కూడా కోర్టు వెంటనే ఇలాంటి తీర్పునే ఇవ్వడం ఖాయమని, జగన్ ప్రభుత్వానికి చెప్పుకోడానికి ఏమీ ఉండదని, కోర్టు మొట్టికాయలు తప్పవని న్యాయనిపుణులు అంటున్నారు. ప్రోగ్రామ్ కోడ్ 1994లోని 6, 7 నియమ నిబంధనలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానల్స్ ఉల్లంఘించినట్టు జగన్ ప్రభుత్వం ఏ విచారణా చేపట్టకుండా ఏకపక్షంగా ప్రసారాలు ఆపేయడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం. చంద్రశేఖరరావు మార్గమే నా మార్గమంటున్న జగన్ ప్రభుత్వానికి కచ్చితంగా భంగపాటు తప్పదేమో..