రంగారెడ్డి జిల్లా న్యాయవాది నారపాక సురేందర్ పై దాడి చేయడం దౌర్జన్యం అంటూ అడ్వకేట్స్ సంఘం నిరసనకు దిగింది. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎల్బీనగర్ లో అడ్వకేట్స్ సంఘం బుధవారం ర్యాలీ నిర్వహించింది. ఓ కేసు విషయంలో నల్గొండ జిల్లాకు వెళ్లి కోర్టులో వాదించి రంగారెడ్డి జిల్లా కోర్టుకు వస్తున్న తరుణంలో లాయర్ సురేందర్ పై ఆగంతకులు దాడి చేశారు.
ప్రస్తుతం న్యాయవాది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ దాడిని నిరసిస్తూ.. న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదని లాయర్ల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయవాదులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు.
20 రోజుల్లో సురేందర్ కు జరిగిన దాడి విషయంలో పరిష్కారం దొరకకపోతే తెలంగాణ సెక్రటరీ ముట్టడిస్తామంటూ న్యాయవాదుల సంఘం హెచ్చరించింది. 41 సీఆర్పీ వల్ల న్యాయవాదులకు కేసులు కూడా రావడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే 41 సీఆర్పీని రద్దు చేయాలంటూ న్యాయవాదుల సంఘం కోరింది.