• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » ఎదురు తిరిగిన స్థానిక‌ ద‌ళాలు – తాలిబాన్లకు ఎదురుదెబ్బ‌

ఎదురు తిరిగిన స్థానిక‌ ద‌ళాలు – తాలిబాన్లకు ఎదురుదెబ్బ‌

Last Updated: August 21, 2021 at 1:15 pm

ఆప్ఘ‌నిస్థాన్‌ను వ‌శం చేసుకున్నామ‌ని సంబంర‌ప‌డుతున్న తాలిబాన్ల‌కు ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. దేశంలోని ప‌లు చోట్ల స్థానిక తాలిబాన్ వ్య‌తిరేక సాయుధ‌ ద‌ళాలు వారిపై ఎదురుదాడిని ప్రారంభించాయి. ఈ మేర‌కు తాలిబాన్ల‌తో పోరాడి బ‌గ్లాన్ ప్రావిన్స్‌లోని బాను, పోల్ ఈ హెసార్, దె స‌ల‌హ్ ఇన్ జిల్లాల‌ను స్వాధీనం చేసుకున్నాయి. మిగిలిన జిల్లాల‌ను కూడా స్వాధీనం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. వీరి ప్ర‌తిఘ‌ట‌న‌లో క‌నీసం 60 మంది తాలిబాన్‌కు చెందిన సైనికులు మ‌ర‌ణించిన‌ట్టుగా తెలుస్తోంది. ఇరువ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన యుద్ధానికి సంబంధించిన దృశ్యాలు కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. యూకేకు చెందిన ప‌ర్షియ‌న్ టీవీ జ‌ర్న‌లిస్టు ఒక‌రు ట్వీట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు. మ‌రో పోస్టులో ఆప్ఘాన్ జెండా ఎగ‌రేస్తున్న స్థానిక ద‌ళాలు క‌నిపిస్తున్నాయి.

BREAKING:
An ex, Afgh government officials tell me that local resistances forces in Baghlan province have recaptured Banu and Pol-e-Hesar districts from the Taliban. They are advancing towards the Deh Salah district. About 60 Taliban fighters were killed or injured. pic.twitter.com/OX8CBUTcSO

— Tajuden Soroush (@TajudenSoroush) August 20, 2021

Public’s Resistance Forces under Khair Muhammad Andarabi claim that they have captured Pol-e-Hesar, Deh Salah and Banu districts in #Baghlan and advancing towards other districts. They are saying that the Taliban did not act in the spirit of a general amnesty. #Taliban pic.twitter.com/AS8isXlwNC

— Aśvaka – آسواکا News Agency (@AsvakaNews) August 20, 2021

Advertisements

మ‌రోవైపు తాలిబాన్ల‌కు ఎదుర్కొనేందుకు పంజ‌షిర్ లోయ‌లో వారి వ్య‌తిరేక ద‌ళాలు ప‌థ‌కం ర‌చిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. తాలిబాన్ల‌పై గెరిల్లా త‌ర‌హా దాడులు చేయాల‌ని భావిస్తున్న‌ట్టుట్టుగా తెలుస్తోంది. అప్ఘాన్ ఉపాధ్య‌క్షుడు అలాగే తాలిబాన్ వ్య‌తిరేక పోరాట సంస్థ యోధుడు అహ్మ‌ద్ షా మ‌సూద్ కుమారుడు అహ్మ‌ద్ మసూద్ నాయ‌క‌త్వంలో ఈ సేన‌లు ప‌నిచేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ మేర‌కు ర‌ష్యా చెందిన ప్ర‌భుత్వ ప్ర‌తినిధి లావ్రోవ్ ఈ విష‌యాన్ని మీడియాతో పంచుకున్నారు. తాలిబాన్లు.. మొత్తం ఆప్ఘ‌నిస్థాన్‌ను త‌మ ఆధీనంలోకి తీసుకోలేర‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇదిలా ఉంటే ఆప్ఘ‌నిస్థాన్‌లోని పంజ‌షిర్ లోయ సైనిక‌ బ‌ల‌గాల‌క‌ అత్యంత సుర‌క్షిత‌మైన‌ద‌ని అంటున్నారు. ఆప్ఘ‌నిస్థాన్ భూభాగంలో ఒక మూల‌న ఉండే ఈ ప్ర‌దేశంలోకి శ‌త్రువులు అంత సులువుగా ప్ర‌వేశించ‌లేర‌ని చెప్తున్నారు. తాలిబాన్ వ్య‌తిరేక పోరాట సంస్థ‌ను న‌డిపిస్తున్న అహ్మ‌ద్ మ‌సూద్ ఇప్ప‌టికే..తమ పోరాటానికి అమెరికా సేన మ‌ద్ద‌తు కూడా కోరిన‌ట్టుగా తెలుస్తోంది.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

సోనియా వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడిపై రేప్ కేస్‌..

బాలీవుడ్ పై మాఫియా ఎఫెక్ట్..!

తెలంగాణ‌లో ఫోర్త్‌వేవ్ భ‌యం..?

వ‌స‌తిగృహంలో ఫుడ్ పాయిజ‌న్‌.. 128 మందికి అస్వ‌స్థ‌త‌

అమ్మే హక్కు.. ఈ ముఖ్యమంత్రికి ఎక్కడిది..?

బ‌స్సే ఆసుప‌త్రి..తోటి ప్ర‌యాణికులే సిబ్బంది..

ఆ జంట‌..విడిపోయిన 52 ఏళ్ల త‌రువాత‌..

ఓ వైపు నిరసనల పర్వం.. మరోవైపు ఐఏఎఫ్‌కు వెల్లువలా దరఖాస్తులు

క్రికెట్ కు ఇంగ్లాండ్ సార‌థి బై..బై..!

జాక్వెలిన్‌ను ప్ర‌శ్నించిన ఈడీ

అగ్నిపథ్ తో దేశ రక్షణకు ప్రమాదం..

పోలీసు బాస్ అయితే మాకెంటి..?

ఫిల్మ్ నగర్

బాలీవుడ్ పై మాఫియా ఎఫెక్ట్..!

బాలీవుడ్ పై మాఫియా ఎఫెక్ట్..!

జాక్వెలిన్‌ను ప్ర‌శ్నించిన ఈడీ

జాక్వెలిన్‌ను ప్ర‌శ్నించిన ఈడీ

ప్రేమ‌తో మీ సమంత‌..!

ప్రేమ‌తో మీ సమంత‌..!

అవును ఐశ్వ‌ర్య‌తో వైరుధ్యాలున్నాయి

అవును ఐశ్వ‌ర్య‌తో వైరుధ్యాలున్నాయి

ప్లీజ్‌... ఆ పాత్ర మీరే చేయండి సార్‌.!

ప్లీజ్‌… ఆ పాత్ర మీరే చేయండి సార్‌.!

శంకర్ దాదా ఎంబిబిఎస్ లో ఏటీఎం పాత్ర చేయాల్సిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

శంకర్ దాదా ఎంబిబిఎస్ లో ఏటీఎం పాత్ర చేయాల్సిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

రావు గోపాల్ రావు అన్ని ఇబ్బందులు పడ్డారా? చనిపోయాక కూడా ఎవ్వరూ పోలేదట!

రావు గోపాల్ రావు అన్ని ఇబ్బందులు పడ్డారా? చనిపోయాక కూడా ఎవ్వరూ పోలేదట!

అమ్మవుతున్న అలియా!

అమ్మవుతున్న అలియా!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)