రెండు రోజులుగా కాబూల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవన్నీ దేశం వదిలి వెళ్లిపోవాలనుకుంటున్న అక్కడి ప్రజల దీనస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ క్రమంలోనే అంతరిక్ష సంస్థ మాక్సర్ టెక్నాలజీస్ కాబూల్ ఎయిర్ పోర్టుకు చెందిన శాటిలైట్ ఫోటోలను విడుదల చేసింది.
ఆఫ్ఘాన్ లో పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈ ఫోటోలు చెబుతున్నాయి. విమానాశ్రయంలో వందలాది మంది గుమిగూడి ఉన్నారు. రన్ వేపైనా.. ఎయిర్ పోర్టు బయటా ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు.
ఓ ఫోటో అయితే.. విమానాలు ఎక్కే హడావుడిలో ప్రజలు తమ కార్లను రోడ్లపై వదిలివేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలను మూసివేశారు.