ఆఫ్ఘనిస్తాన్ లో జనవరి నుంచి ఇప్పటి వరకు పోషకాహార లోపం, ఆకలి కారణాలతో సుమారు 13000 మంది చిన్నారులు మరణించినట్టు హ్యూమన్ రెట్స్ వాచ్ సంస్థ తెలిపింది.
దేశంలో 95 శాతం జనాభాకు కనీసం తినడానికి తిండి దొరకడం లేదని సంస్థ వెల్లడించింది. ఆ దేశంలో 3.5 మిలియన్ల మంది పిల్లలకు పోషకాహార మద్దతు కావాలని పేర్కొంది.
‘ ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో పోషకాహార లోపం, ఆకలి కారణాలతో ఇప్పటి వరకు 13000 మంది చిన్నారులు మరణించారు. సరాసరి రోజుకు 170 మందికి పైగా చిన్నారులు మరణిస్తున్నారు” అని హ్యూమన్ రైట్స్ వాచ్ సీనియర్ అధికారి బిర్జిత్ స్వ్కార్జ్ తెలిపారు.
ఆప్ఘన్ కు సహాయం అందించేందుకు చాలా దేశాలు ముందుకు వస్తున్నాయని, అయితే ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆఫ్ఘనిస్తాన్‌కు తక్షణమే పనిచేసే బ్యాంకింగ్ వ్యవస్థ అవసరమని ఆయన వెల్లడించారు.