ఆఫ్ఘాన్ లో తాలిబన్ల రాక్షసత్వానికి నిదర్శనంగా మరో ఘటన జరిగింది. 8నెలల గర్భిణీ అని కూడా చూడకుండా మాజీ పోలీస్ అధికారిని దారుణంగా చంపేశారు.
ఘోర్ ప్రావిన్స్ లో ఉండే బాను నెగర్ గతంలో పోలీస్ అధికారిగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భవతి. అయితే తమకు వ్యతిరేకంగా పనిచేసిన ఆఫీసర్లను వెతికి పట్టుకుని చంపుతున్న తాలిబన్లు.. బాను నెగర్ ను కూడా దారుణంగా హత్య చేశారు. ఆమె కుటుంబసభ్యులు చూస్తుండగానే వీధిలోకి లాక్కొచ్చి తలపై తుపాకీతో కాల్చి చంపేశారు.
షరియా చట్టం ప్రకారమే మహిళలు నడుచుకోవాలని నినాదాలు చేశారు తాలిబన్లు. అయితే 8 నెలల గర్భిణీ అని కూడా చూడకుండా కాల్చి చంపడంపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో తాలిబన్ల ప్రతినిధి స్పందించి దీన్ని ఖండిస్తున్నట్లు.. విచారణ జరుపుతామని చెప్పేసి చేతులు దులుపుకున్నాడు.