ప్రస్తుతం కరోనాను అంతం చేయాలంటే టీకానే రక్ష. అలాంటిది.. అసలు వ్యాక్సినే మాకొద్దని ప్రకటించారు తాలిబన్లు. కరోనాను నిరోధించేందుకు ప్రపంచం మొత్తం వాడుతున్న టీకాలపై నిషేధం విధించారు.
ఆఫ్ఘాన్ లో ముప్పావు వంతుకు పైగా భూభాగాన్ని ఆక్రమించిన తాలిబన్లు.. పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కొత్త నిబంధనను ప్రకటించారు. తూర్పు ప్రాంతంలో ఉన్న పక్తియా ప్రావిన్స్ లో దీన్ని అమలు చేస్తున్నారు. ఈ ఏరియాను గత వారమే తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఒక్కో ప్రాంతీయ రాజధానిని తమ అధీనంలోకి తీసుకుంటున్నారు తాలిబన్లు. అఫ్గాన్ ప్రభుత్వం తమ పట్టు నిలుపుకోవడానికి కష్టాలు పడుతుంటే.. వారు మాత్రం వేగంగా పట్టు పెంచుకుంటున్నారు. మరో కొద్ది రోజుల్లోనే కాబూల్ పై కూడా దాడి చేస్తారని తెలుస్తోంది. ఇంకో 90 రోజుల్లో అఫ్గాన్ ప్రభుత్వం కూలిపోతుందని ప్రచారం జరుగుతోంది.