అమెరికా బలగాలు ఆఫ్ఘాన్ ను వీడడంతో తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి సంతోషం వ్యక్తం చేశారు. యూఎస్ కు చెందిన చివరి విమానం అలా ఎగిరిందో లేదో… తాలిబన్లు ఎయిర్ పోర్టు లోపలికి ఎంటర్ అయిపోయారు.
అమెరికా సైన్యం వదిలేసిన యూనిఫాంలు ధరించి.. అక్కడి పరిసరాలను పరిశీలించారు తాలిబన్లు. ఒక దశలో తమ విజయానికి గుర్తుగా రన్ వే పై నడిచారు.
విమానాశ్రయాన్ని నడపడానికి అమెరికన్ మిలిటరీ కొన్ని పరికరాలను తాలిబాన్ల కోసం వదిలేసింది. వాటిలో రెండు ఫైర్ ట్రక్స్, కొన్ని ఫ్రంట్ ఎండ్ లోడర్స్, ఎయిర్ క్రాఫ్ట్ మెట్లు ఉన్నాయి. కొన్ని హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. వాటిని తనిఖీ చేశారు తాలిబన్లు.