కాబూల్ విమాన ఘటన చాలామందికి ఇంకా కళ్లముందే కదలాడుతోంది. గాల్లో ఉన్న విమానం పైనుంచి జనం పిట్టల్లా రాలుతున్న వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఫార్వార్డ్ అవుతూనే ఉన్నాయి. ఆరోజు విమానం చక్రాలను గట్టిగా పట్టుకొని ప్రయాణం చేయాలని చూసిన ఇద్దరు ఆఫ్ఘన్ పౌరులు… తర్వాత పట్టుజారి కిందపడిపోయారు. వీరిద్దరూ విమానాశ్రయానికి 4 కిలోమీటర్ల దూరంలోని ఓ ఇంటిపై పడ్డారు.
పెద్ద శబ్దం రావడంతో మేడపైకి వెళ్లి చూసిన ఇంటి యజమాని షాకయ్యాడు. అక్కడి దృశ్యం ఎంతో భయోత్పాతంగా అనిపించింది. బాగా హైట్ నుంచి పడడంతో ఇద్దరి తలలు పగిలిపోయాయి.. చూడడానికి భయంకరంగా ఉంది. అది చూసి అతడి భార్య కళ్లు తిరిగి పడిపోయింది.
మృతుల దగ్గర ఉన్న బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా వారిని గుర్తించారు. అందులో ఒకరు డాక్టర్. వారి మృతదేహాలను స్థానికంగా ఉన్న మసీదుకు తరలించారు. ఇద్దరి వయసు 30 ఏళ్లకు మించి ఉండవని చెప్పారు స్థానికులు.