శ్రద్దా వాకర్ హత్య కేసులో శవ పరీక్షల్లో సంచలన విషయం వెల్లడైంది. శ్రద్ధా వాకర్‌ను ఆమె బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా ముక్కలుగా కోసి చంపాడు. ఆమెను ముక్కలుగా కోసేందుకు రంపం వాడినట్టు అటాప్సీలో తేలింది. శ్రద్దావాకర్ హత్య అనంతరం ఆమె ఎముకలను పోలీసులు అడవిలో స్వాధీనం చేసుకున్నారు.
వాటికి మంగళవారం ఎయిమ్స్ లో అస్టియోలాజికల్ టెస్టులకు పంపించారు. వాటికి పరీక్షలు జరపి ఆ నిర్దారణకు వచ్చారు. శ్రద్దా వాకర్ శరీరాన్ని కోసేందుకు అఫ్తాబ్ రంపాన్ని ఉపయోగించినట్టు తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని సాకేత్ కోర్టుకు తెలియజేస్తామన్నారు.
శ్రద్ధా వాకర్, అఫ్తాబ్ అమీన్ పూనావాలాలు బంబుల్ అనే డేటింగ్ యాప్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. వారిద్దరూ గతేడాది మే8న ఢిల్లీకి వచ్చారు. అనంతరం వారు మే15న చత్రాపూర్‌కు షిఫ్ట్ అయ్యారు. మే 18న శ్రద్దావాకర్ ను అఫ్తాబ్ పూనావాల హత్య చేశాడు.
ఆమె శరీరాన్ని మొత్తం 35 ముక్కలుగా అఫ్తాబ్ కోశాడు. అనంతరం ఆమె శరీర భాగాలను వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. ఆమె ఎముకలను సమీపంలోని అటవీ ప్రాంతంలో అఫ్తాబ్ విసిరేశాడు. దర్యాప్తు సమయంలో ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.