టీమిండియా ఆటగాడు ఛతేశ్వర్ పుజారాకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ పరోక్ష హెచ్చరిక చేశాడు. ఈ రెడ్ బాల్ స్పెషలిస్ట్ 2018-19 లో కంగారూలను ‘భయపెట్టినప్పటికీ’.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆ సత్తా చూపలేకపోయాడు. గురువారం నుంచి నాగ్ పూర్ లో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో మళ్ళీ ఛతేశ్వర్ అలాంటి సామర్థ్యం చూపాలని గంగూలీ అన్నాడు.
రానున్న సిరీస్ ఇతనికి ఎంతో ముఖ్యమైనదని, ఇతగాడు ఇంకా కృషి చేయవలసి ఉందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో గత మూడేళ్ళ ఇతని పర్ఫామెన్స్ ను మదింపు చేసిన విషయాన్నీ గంగూలీ గుర్తుకు తెచ్చాడు. చాలాకాలంగా పుజారా టీమిండియా తరఫున శతకాలు నమోదు చేయలేదు. ఆశించిన రీతిలో పరుగులు చేయలేదు.
ఢిల్లీలో పుజారా తన వందో టెస్ట్ ఆడుతున్నాడు. ఇది ఎంతో చెప్పుకోదగిన విషయం.. అలాగే ఇన్ని టెస్ట్ మ్యాచ్ లు ఆడడం గొప్పవిషయమే..ఈ ప్రశంసలకు ఎంతైనా అర్హుడే.. కానీ ఈ ప్లేయర్ ప్రత్యర్థి జట్ల నుంచి ఎన్ని ‘దాడులు ఎదురైనా’ అతడు తన ప్రతిభ చూపించుకోవలసిందే అని గంగూలీ వ్యాఖ్యానించాడు.
లోగడ ఇంగ్లాండ్ లో జరిగిన రాయల్ లండన్ కప్ వన్డే ఛాంపియన్ షిప్ లో సస్సెక్స్ జట్టుకు ఆడిన పుజారా.. వరుసగా రెండో సెంచరీ సాధించాడు. ఈ కుడిచేతి బ్యాటర్ నాడు మెరుపు శతకం బాదాడు. కానీ ఇతడు అంతబాగా ఆడినప్పటికీ ఆ మ్యాచ్ లో పుజారా జట్టు ఓడిపోయింది.