సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య తర్వాత మూసేసిన అబ్ధుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో ఆఫీస్ తెరుచుకుంది. దాదాపు 24 రోజుల తర్వాత కొత్త బిల్డింగ్‌లో ఎమ్మార్వో కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త ఎమ్మార్వోగా వెంకట్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు.
కార్మికులు విధుల్లోకి… కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ?
పట్టాదారు పాసు పుస్తకాల్లో తమ పేర్లను కాకుండా కౌలుదార్లను చేర్చారన్న కోపంతో సురేష్ అనే రైతు ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ పోసి అత్యంత కిరాతకంగా హాత్య చేశాడు. ఆ ఘటనలో ఎమ్మార్వో విజయారెడ్డి, ఆమె డ్రైవర్‌తో పాటు సురేష్ కూడా మృతి చెందారు. దాంతో అప్పటి నుండి ఎమ్మార్వో కార్యాలయం మూతపడింది.