హర్యానాలో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కు షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. ఆయనపై స్వతంత్ర్య అభ్యర్థి కార్తికేయ శర్మ విజయం సాధించారు.
అజయ్ మాకెన్ అతి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారని హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ భూషణ్ వెల్లడించారు. బీజేపీ మద్దతుతో కార్తికేయ గెలిచారని ఆయన అన్నారు.
హర్యానాలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలను శుక్రవారం నిర్వహించారు. ఇందులో ఒక స్థానంలో బీజేపీ నేత కిషన్ లాల్ పన్వర్ ఘన విజయం సాధించారు.
మరో స్థానంలో కాంగ్రెస్ నేత అజెయ్ మాకెన్, కార్తికేయకు మధ్య పోటి నడించింది. క్రాస్ ఓటింగ్, నిబంధనల ఉల్లంఘనల ఆరోపణల, రీ కౌంటింగ్ ల వల్ల కౌంటింగ్ ఆలస్యం అయింది. దీంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కార్తికేయ విజేతగా నిలిచినట్టు అధికారులు అర్ధరాత్రి తర్వాత ప్రకటించారు.