దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మళ్లీ లాక్ డౌన్ విధించబోతున్నారా…? ఇప్పుడు ఈ చర్చ హాట్ టాపిక్ అవుతుంది. ముంబైలో కరోనా కేసులు పెరుగుతుండటం, ప్రజలు కోవిడ్ నిబంధనలను గాలికొదిలేయటంతో మళ్లీ లాక్ డౌన్ అంశాన్ని పరిశీలించాల్సి వస్తుందని నగర మేయర్ కిషోరి పండేకర్ హెచ్చరించారు.
ముంబైలో రైళ్లో ప్రయాణాలు పెరిగాయి. కానీ జనం మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటించటం లేదని… దీంతో ముంబై ఏమవుతుందోనన్న ఆందోళన ఉందని పండేకర్ పేర్కొన్నారు. మరోసారి లాక్‌డౌన్‌కి వెళ్లకూడదనుకుంటే ప్రజలు అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించి, ప్రభుత్వానికి సహాకరించాలని కోరారు. లాక్ డౌన్ విధించాలో వద్దో ప్రజల చేతుల్లోనే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశం మొత్తంలో ప్రతి రోజు సుమారు 10వేల కేసులు కొత్తగా నమోదవుతుంటే… అందులో దాదాపు సగం కేసులు మహారాష్ట్ర, కేరళ నుండే నమోదవుతుండటం అక్కడి ప్రభుత్వాలను టెన్షన్ పెడుతోంది.