కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఓటర్లపై రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన హామీ ఇచ్చింది.
తాము అధికారంలోకి వస్తే గృమ లక్ష్మీ యోజన కింద ప్రతి మహిళకు నెల నెలా రూ. 2000 ఇస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వెల్లడించారు. అంతకు ముందు కూడా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పలు హామీలను ఇచ్చింది.
తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటికీ నెల నెలా 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే ఈ పథకాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్లో అమలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాము కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొంది.
దీనిపై అధికార బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ హామీలు కేవలం మాటలకే పరిమితమవుతాయని చెప్పింది. ఓటర్లు కాంగ్రెస్ మాటలు నమ్మి మోస పోవద్దని బీజేపీ నేతలు కోరుతున్నారు. రాష్ట్రంలో బీజేపీనే గెలిపించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.