కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చి పోతున్నారు. షోఫియాన్ ఆపిల్ తోటలో ఓ కశ్మిరీ పండిట్ ను ఉగ్రవాదులు మంగళవారం కాల్చి చంపారు. తాజాగా లోయలో మైనార్టీలు, కశ్మరీయేతరులను టార్గెట్ చేస్తూ హెచ్చరికలు చేస్తన్నారు.
లోయలో మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని కేంద్రం హోం శాఖ అధికారులు వెల్లడించారు. కశ్మీరి పండిట్లకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
షోపియన్ జిల్లాలో సునీల్ కుమార్ అనే కశ్మీరి పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో సునీల్ కుమార్ సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనతో పాటు మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడిని ఎంఐఎం నేత అసదుద్దిన్ ఓ వైసీ తీవ్రంగా ఖండించారు. కశ్మీర్ పండిట్లకు లోయలో భద్రత లేదని, శాంతి భద్రతల రక్షణలో కేంద్రం విఫలమైందన్నారు.