మెరుగైన రవాణా సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెత్తపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరగుతోంది. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్లు.. ప్రయాణికుల నిర్లక్ష్యంతో చెత్తతో నిండిపోతున్నాయి. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ దీనికి సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు.
ఖాళీ వాటర్ బాటిల్స్, వాడిన ఫుడ్ కంటెయినర్లు, ప్లాస్టిక్ బ్యాగ్‌లు, చెత్తా చెదారం చెల్లాచెదురై పడి ఉన్నాయి. ఓ వర్కర్ చేత చీపురు పట్టుకుని క్లీన్ చేయడానికి వస్తున్నట్టు ఉన్నాడు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.ఆయన పోస్ట్‌కు నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. ప్రయాణికుల వైఖరి, మనస్తతత్వం మారనంత కాలం ఏ ట్రైన్ అయినా ఇలాంటివి తప్పదంటూ కామెంట్లు చేస్తున్నారు
ఓ వైపు చెత్తాచెదారం శుభ్రం చేశాక కూడా.. సిబ్బంది ముందే చెత్తా పారబోస్తున్నారు. వందే భారత్ రైళ్లు గమ్యస్థానం నుంచి ప్రారంభం అయ్యే లోపే ప్రయాణికులు వేస్తున్న చెత్తాచెదారంతో నిండిపోతోందని సిబ్బంది వాపోతున్నారు.అత్యాధునిక, సాంకేతిక వ్యవస్థలతో పనిచేసే వందే భారత్ రైళ్లలో.. విమానాల్లో మాదిరి ఇంటీరియర్ కనిపిస్తుంది. కోచ్‌లన్నీ ఫ్లైట్ ఇంటీరియర్‌తో పోలి ఉంటాయి. సీటింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. సాంకేతిక వ్యవస్థలతో పనిచేసే వందే భారత్ రైళ్లలో.. విమానాల్లో మాదిరి ఇంటీరియర్ కనిపిస్తుంది. కోచ్‌లన్నీ ఫ్లైట్ ఇంటీరియర్‌తో పోలి ఉంటాయి. సీటింగ్ కూడా అదే విధంగా ఉంటుంది.
ఇక ఈ చెత్తను కంట్రోను చేయడానికి కూడా కేంద్రం విమాన తరహాలోనే వందేభారత్ రైళ్లలో పారిశుద్ధ్య నిర్వహణ చేయలని నిర్ణయించుకుంది. ఇక నుంచి ఏదైనా చెత్త ఉంటే వేయమని కోరుతూ చెత్త సేకరణ చేసే వ్యక్తి కోచ్ అంతా తిరుగుతూ చెత్తను ఒక సంచిలోకి సేకరించనున్నాడు.ఆహార పదార్థాలు తినేశాక మిగిలిన వాటిని బోగీలోనే పడేయకుండా పక్కన పెట్టి, మెయింటనెన్స్ సిబ్బంది వచ్చాక ఆ చెత్త బుట్టలో పడేయాలని అశ్విని వైష్ణవ్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కొత్త పద్ధతి అమలు చేస్తే ఎలా ఉండబోతోందో చెబుతూ కేంద్ర మంత్రి ఓ వీడియోను ట్వీట్ చేశారు