ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పోస్టర్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. నిన్న మొన్నటి దాకా ఢిల్లీకి పరిమితమైన ఈ ప్రచారాన్ని దేశం మొత్తం నిర్వహించాలని నిర్ణయించింది. ‘మోడీ హటావో- దేశ్ కీ బచావో’అని 11 భాషల్లో ముద్రించిన పోస్టర్లను దేశ వ్యాప్తంగా నగరాల్లో అంటింస్తోంది.
ప్రధాని మోడీ విద్యార్హతల గురించి అందులో ప్రశ్నిస్తున్నారు. క్యా భారత్ కే పీఎం కో పడే లిఖే హోనా చాహియే(భారత ప్రధాన మంత్రి చదవుకోవాల్సిన అవసరం ఉందా) అని అందులో ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్టర్ల ప్రచారం గురించి ఆప్ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడారు.
మార్చి 30న దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ఆప్ పోస్టర్లను ప్రదర్శిస్తుందని ఆయన పేర్కొన్నారు. పార్టీకి చెందిన అన్ని రాష్ట్ర యూనిట్లు తమ తమ రాష్ట్రాల్లో పోస్టర్లు అతికించాలని పార్టీ కోరుతున్నట్టు ఆయన చెప్పారు. పోస్టర్లు 11 భాషల్లో ముద్రించబడినట్టు
ప్రధాని మోడీని తొలగించాలంటూ దేశ రాజధానిలో ఇటీవల వేలాది పోస్టర్లు కనిపించాయి. దీంతో ఢిల్లీ పోలీసులు 100కి పైగా కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. దీన్ని ఆప్ సీఎం కేజ్రీవాల్ ఖండించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో తమకు వ్యతిరేకంగా పోస్టర్లు వేసిన వారిని బ్రిటిష్ వారు కూడా అరెస్టు చేయలేదని ఆయన చెప్పారు.