కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా తేలినట్టు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయని ఆమె తెలిపారు.
‘ నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. అన్ని ప్రోటోకాల్స్ ను పాటిస్తున్నాను. హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలుసుకున్న వారందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను ‘ అని ఆమె అన్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కూడా గురువారం కొవిడ్ పాజిటివ్ గా తేలింది. అయితే కొవిడ్ వచ్చినప్పటికీ ఈడీ దర్యాప్తునకు హాజరవుతానని కాంగ్రెస్ నేత సూర్జేవాలా వెల్లడించారు.
ప్రియాంక గాంధీ గురువారం తన లక్నో పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. వెంటనే ఢిల్లీకి తిరిగివచ్చారు. పర్యటన రద్దుకు గల కారణాలను ఆమె తెలపలేదు. అయితే సోనియాకు కరోనా పాజిటివ్ రావడంతోనే ప్రియాంక తన పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నట్టు వివరించారు.