పంజాబ్ లో ఆప్ విజయాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ ఆదివారం విజయోత్సవ ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీలో ఆప్ సీఎం అభ్యర్థి భగవాన్ మాన్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఆయనతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ర్యాలీకి ముందు ఆయన అమృత్ సర్ లోని స్వర్ణ ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు.
అంతకు ముందు సమావేశానికి హాజరైన సీఎం అభ్యర్థి మాన్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వారి ఇరువురిపై పార్టీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు.
ధురీ నియోజక వర్గం నుంచి సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్ పోటీ చేశారు. సుమారు 58000లకు పై చీలుకు ఓట్లతో ఆయన గెలుపొందారు. ఆ తర్వాత ఆప్ శాసన సభ పక్ష నేతగా ఆయనను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.