ప్రముఖ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీ కాలాన్ని మరోసారి పొడగించే యోచనలో కేంద్రం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెల 30తో ఆయన పదవీ కాలం ముగియాల్సి వుంది. మరో ఏడాది పాటు ఆయన సేవలను వినియోగించుకోవాలని కేంద్రం ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
గతంలో రెండు సార్లు ఆయన పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. 2107లో ముకుల్ రోహిత్గీ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో 1 జూలై 2017న అటార్నీ జనరల్ గా కేకే వేణుగోపాల్ ను కేంద్రం నియమించింది.
ఆయన పదవీ కాలం పొడగింపునకు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం లేదా బుధవారం విడుదల చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆయన 2023 జూన్ వరకు పదవిలో కొనసాగనున్నారు.