ఏపీ అసెంబ్లీలు మొదలవటంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల దాడి మొదలైంది. తొలిరోజే రైతుల సమస్యలపై అధికార, విపక్షాల మధ్య మాటా మాట పెరిగిపోయింది. అకాల వర్షాలతో రైతులకు జరిగిన పంట నష్టంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది.
రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తమ ఎమ్మెల్యేలతో కలిసి స్పీకర్ పోడియం ముందు నేలపై కూర్చొని నిరసన తెలపగా, చంద్రబాబు రౌడీయిజం చేస్తున్నారంటూ జగన్ ఎదురుదాడి చేశారు. టీడీపీ నేతలు అవగాహాన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తన పాలనలో రైతులను ఏమాత్రం పట్టించుకోలేదని, డిసెంబర్ చివరి నాటికి రైతులందరికీ ఇన్ పుట్ సబ్సిడి చెల్లిస్తామన్నారు.
అంతకుముందు తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతూ… చంద్రబాబు ఆవేశంతో ఊగిపోయారు.
టీడీపీ సభ్యుల నిరసనను విరమించకపోవటంతో… ప్రభుత్వం చేసిన తీర్మానం మేరకు స్పీకర్ టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సభ నుండి సస్పెండ్ చేశారు.