చూస్తుంటే… టిల్లూ స్క్వేర్ సినిమాలో హీరోయిన్ మరోసారి మారేలా కనిపిస్తోంది. మొన్నటికిమొన్న ఈ సినిమా కోసం మడొన్నా సెబాస్టియన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి పేరు గట్టిగా వినిపిస్తోంది.
హిట్-2తో సక్సెస్ అందుకుంది మీనాక్షి. సో.. ఇలాంటి ముద్దుగుమ్మ తమ ప్రాజెక్టులో ఉంటే వెయిట్ పెరుగుతుందని హీరో సిద్ధు జొన్నలగడ్డ భావిస్తున్నాడు. అందుకే తాజాగా ఎంపిక చేసిన మడొన్నాను పక్కనపెట్టి, మీనాక్షికి చోటివ్వాలని నిర్ణయించుకన్నాడట.
ఇదే కనుక జరిగితే మీనాక్షి నంబర్, 4 అవుతుంది. ఎందుకంటే, ముందుగా ఈ ప్రాజెక్టులోకి వచ్చిన హీరోయిన్ శ్రీలీల. ఆమె వారం రోజుల పాటు షూట్ కూడా చేసింది. అంతలోనే ఆమెను తొలిగించారు. ఆ స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారు. ఆమెతో కూడా షూటింగ్ చేశారు.
అంతలనే అనుపమ ను కూడా తీసేశారు. ఆ స్థానంలో మొడన్నాను తీసుకున్నారు. సెబాస్టియన్ తో షూటింగ్ కూడా స్టార్ట్ చేయకుండానే ఆమెను కూడా తీసేసే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా మీనాక్షి చౌదరి పేరు వినిపిస్తోంది మరి.
బ్లాక్ బస్టర్ హిట్టయిన డీజే టిల్లూ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది టిల్లూ స్క్వేర్. దీంతో ఈ సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ. పైగా నిర్మాతలు, హీరోకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో నిర్ణయాలన్నీ సిద్ధు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి.