టెలికం కంపెనీల పోటీతో… కాల్ రేట్స్, ఇంటర్నేట్ రేట్స్ బాగా తగ్గించి దివాలు తీస్తున్న ఎయిర్‌టెల్ ఓవైపు చార్జీలు పెంచుతూనే జియోతో యుద్ధం చేయడానికి రెడీ అయిపోయింది. ఇటు ఎయిర్‌టెల్‌ను అడ్డుకునేందుకు జియో కూడా రంగంలోకి దిగిపోవటంతో… టెలికాం ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ఎం జరుగుతుందా అని ఎదురు చూస్తోంది.
జియో కస్టమర్లు ఎవరైనా సరే ఎయిర్‌టెల్‌కు వచ్చేస్తే 100రూపాయల బోనస్ ఇస్తోంది ఎయిర్‌టెల్. దీంతో జియో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేస్తోంది. తాము విక్రయించే ప్రతి కొత్త కనెక్షన్‌పై 100రూపాయల వరకు ఇస్తోంది. గతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అయితే… ఇప్పటికే భారీ అప్పుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా మాత్రం ఇంకా వేలు పెట్టలేదు.
అంతేకాదు… రాబోయే రోజుల్లో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నుండి వచ్చే కస్టమర్లకు మరిన్ని ఆఫర్స్ ప్రకటించేందుకు జియో రెడీ అవుతోందట.
అదే జరిగితే… టెలికాం రంగంలో మరో కుదుపు ఖాయంగా కనపడుతుండగా, కస్టమర్లకు మాత్రం కాస్త రిలీఫ్ దక్కే అవకాశం ఉంది.
మహేష్‌బాబు రెమ్యూనరేషన్ మరీ అంతా…?