తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నియామకం హీట్ పుట్టిస్తోంది. ఏఐసీసీ స్వయంగా రాష్ట్రనేతలతో సంప్రదింపులు జరిపినా… ఎవరికి పీసీసీ అనేది వెల్లడించలేదు. దీంతో నాయకులంతా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. అయితే, పీసీసీ కోసం పట్టుబడుతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవలే ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ సహా పలువురు కీలక నేతలతో సంప్రదింపులు జరిపి వచ్చారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉండటంతో పీసీసీ ఎవరికో తేల్చేస్తారన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది.
కానీ, గత కొన్ని రోజులుగా సైలెంట్ ఉన్న పీసీసీ రేస్ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టడంతో పీసీసీపై అధినాయకత్వం త్వరలోనే ప్రకటన చేస్తుందన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, కోమటిరెడ్డిని ఢిల్లీకి అధిష్టానం పిలిచిందా…? లేదా తనే స్వయంగా వెళ్లారా…? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
కోమటిరెడ్డి తన ఢిల్లీ పర్యటనలో అధిష్టానం నుండి తీపి కబురు వింటారా…? లేక బుజ్జగించటానికే ఆయన్ను పిలిపించారా అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.