గత ఏడాది ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి ప్రవేశపెట్టాలని అర్ఎస్ఎస్ అనుబంధ రైతు సంస్థ బీకేఎస్ కోరింది. దీనికోసం దేశవ్యాప్తంగా బహిరంగ సభలు, నిరసనలు నిర్వహించనున్నట్లు బీకేఎస్ తెలిపింది. వ్యవసాయ చట్టాల రద్దు తర్వాత, రైతులకు ఏమీ లభించలేదని.. మోడీ తల వంచాలని కోరుకునే వ్యక్తులు మాత్రమే సంతోషంగా ఉన్నారని బీకేఎస్ ప్రధాన కార్యదర్శి బద్రీ నారాయణ్ చౌదరి వ్యాఖ్యానించారు.
రైతులు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను పొందుతారనే హామీతో పాటు.. కొనుగోలుదారుల కోసం రిజిస్ట్రేషన్ పోర్టల్.. రైతుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టులను చేయాలన్నారు. కొన్ని మార్పులతో కూడిన రైతు చట్టాలను తిరిగి ప్రారంభించాలని బీకేఎస్ కోరుతోందన్నారు చౌదరి.