పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ఒక మధురమైన ఘట్టం. ఆచారాలు, సాంప్రదాయాలతో చుట్టాలు, బంధువులు మధ్య ఎంతో ఆనందంగా గా పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. అయితే పెళ్లిళ్ల విషయంలో స్త్రీ పురుషుల మధ్య కొంత గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. అబ్బాయిల వయసు కన్నా అమ్మాయిల వయసు తక్కువగా ఉంటుంది. ఎక్కడో లక్షలో ఒకరు, ఇద్దరూ తమకన్నా పెద్ద వారైనా అమ్మాయిలను పెళ్లి చేసుకుంటూ ఉంటారు. సచిన్ టెండూల్కర్ తన భార్య కంటే వయసులో ఆరేళ్ళు చిన్నవాడు. అయినప్పటికీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఒక్క ఏజ్ విషయంలోనే కాదు ఇటీవలకాలంలో కులాంతర, మతాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి. అయితే అసలు ఇంతకీ భార్యాభర్తల మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలి, ఎంత పెద్ద వాడు అయి ఉండాలి అనేదాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆ స్టార్ హీరో నో చెప్తే పవన్ బద్రి చేశాడట!!
ఒకటి నుంచి నాలుగేళ్ల ఏజ్ గ్యాప్… మామూలుగా 21 ఏళ్లు దాటితే పెళ్లి చేసేయొచ్చు. 21 ఏళ్లు దాటిన వెంటనే పెళ్లి చేసుకున్న భార్య భర్తల మధ్య ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పుడు కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. ఈ వయసులో ఉన్న వారు పెళ్లి చేసుకుంటే మొండితనం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. హద్దుల్లో ఉండకపోవడంతో పెద్ద సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అంతే కాదు వైవాహిక బంధంలో తక్కువ టైంలోనే గ్యాప్ కూడా వస్తుందట. వారు విడాకుల వరకు వెళ్ళిన ఆశ్చర్యపోనక్కర్లేదట.
కూతురిని ఇచ్చి పెళ్లి చేయడానికి అల్లు రామలింగయ్య, అరవింద్ చిరంజీవి పై ఎందుకు నిఘా పెట్టారో తెలుసా ?
ఐదు నుంచి ఏడు గ్యాప్ ఉన్నవారి జీవితంలో విభేదాలు తక్కువగా ఉంటాయి. ఇద్దరిలో ఒకరు పరిపక్వత కలిగి ఉంటారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న గొడవలు వచ్చినా సహనంతో ఉంటారు. ఒకరికొకరు సన్నిహితంగా భార్యాభర్తలులా కాకుండా స్నేహితులుగా కూడా ఉంటారు.
నిర్మలమ్మ గారు సినిమాలో అవకాశాల కోసం వెళితే అలా అవమానించారా !
ఇక పదేళ్లకు పైగా ఏజ్ గ్యాప్ వారి మధ్య కూడా పెద్దగా ఇబ్బందులు ఉండవని అంటుంటారు. కానీ ఇటీవల కాలంలో చదువుకున్న అమ్మాయిలు ఏజ్ గ్యాప్ ను యాక్సెప్ట్ చేయట్లేదు. మామూలు జంటలకు ఈ గ్యాప్ కొంచెం ఎక్కువనే చెప్పాలి.
ఇక 20 సంవత్సరాల ఏజ్ గ్యాప్… ఈ ఏజ్ గ్యాప్ లో ఎవ్వరూ కూడా పెళ్లిళ్లు చేసుకోవట్లేదు. కొంత మంది సెలబ్రిటీలు మాత్రం కొన్నిసార్లు వివాహం చేసుకుంటారు. ఇంత ఏజ్ గ్యాప్ ఉండటం వల్ల దాంపత్య జీవితంలో పురుషుడి సంతానోత్పత్తి తో పాటు ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకునే విషయంలో అనేక సమస్యలు వస్తాయి.