లెక్కప్రకారం ఏజెంట్ సినిమా ఆగస్ట్ లో రిలీజ్ అవ్వాలి. ప్రస్తుతానికి మేకర్స్ అదే తేదీకి ఫిక్స్ అయి ఉన్నారు కూడా. కానీ.. తాజాగా యూనిట్ నుంచి వినిపిస్తున్న టాక్ మాత్రం అలా లేదు. ఈ సినిమా ఆగస్ట్ నుంచి వాయిదా పడేలా కనిపిస్తోంది. దీనికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి.
మొదటి కారణం.. ఫెస్టివల్ సీజన్. దసరా సీజన్ లో ఏజెంట్ మూవీని రిలీజ్ చేస్తే బాగుంటుందనేది యూనిట్ లో అందరి అభిప్రాయం. ఎందుకంటే, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రికవర్ అవ్వాలంటే ఫెస్టివల్ సీజన్ యాడ్ అవ్వాల్సిందే.
ఇక రెండో రీజన్ ఏంటంటే.. ఆగస్ట్ రిలీజ్ అంటే ఈ సినిమా పనుల్ని హడావుడిగా చేయాల్సి ఉంటుంది. అదే దసరా రిలీజ్ పెట్టుకుంటే, పోస్ట్ ప్రొడక్షన్ కు ఇంకాస్త టైమ్ దక్కుతుంది.
ఈ రీజన్స్ కారణంగా ఏజెంట్ సినిమా ఆగస్ట్ నుంచి వాయిదా పడి దసరాకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మేరకు సరికొత్త పోస్టర్ తో మేకర్స్ రేపోమాపో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది.
అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. సైరా తర్వాత సురేందర్ డైరక్ట్ చేస్తున్న సినిమా ఇదే. అఖిల్ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీగా వస్తున్న ఏజెంట్ తో సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయమౌతోంది.