అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్. ప్రస్తుతం మార్కెట్లో మంచి సౌండ్ చేస్తున్న సినిమా ఇదే. దీనిపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్లు, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు మార్కెట్ పరంగా కూడా ఏజెంట్ మూవీ అందర్నీ ఆకర్షిస్తోంది. ఇప్పుడీ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాకు సంబంధించి మస్కట్ లో ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు అక్కడి స్థానిక ఫైటర్లతో, అఖిల్ తో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నారు. ఈ షెడ్యూల్ తో ఏజెంట్ మూవీ షూటింగ్ పూర్తవుతుంది. ఏప్రిల్ 28న థియేటర్లలోకి రాబోతోంది ఏజెంట్ మూవీ.
కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోంది ఏజెంట్ మూవీ. ఈ సినిమాలో గూఢచారిగా నటిస్తున్నాడు అఖిల్. దీని కోసం ఎయిట్-ప్యాక్ కూడా సాధించాడు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా ఉంటాయనంటున్నారు మేకర్స్. ఈ సినిమాలో ముమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయమౌతోంది.
అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ఇంకా చెప్పాలంటే అఖిల్ మార్కెట్ వాల్యూను మించి ఖర్చుపెట్టారు నిర్మాత. అంత రాబట్టడం కష్టమనే విషయం తెలిసినప్పటికీ, సినిమా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.