విజయవాడ : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు రావడం సంచలనంగా మారింది. హిమాలయాల్లో ఘోర తపస్సు చేసుకునే ఈ అఘోరాలు సుబ్బారెడ్డి ఇంటికి వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో ఫోటో సహా వార్త ఒకటి బాగా తిరిగింది. పూజలు పూర్తయ్యాక సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు అఘోరాల ఆశీస్సులు తీసుకుంటున్నట్టుగా ఈ ఫొటోలో కనిపిస్తోంది. వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాల రాక వెనుక అంతర్యం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా తీవ్రమైన కోర్కెలు తీరడం కోసం అఘోరాలను పిలిపించి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించడం గుంటూరు జిల్లాలో ఇటీవలి కాలంలో ఒక ట్రెండుగా నడుస్తోంది. అఘోరాలు పూజలు చేసే పద్ధతి కూడా తీవ్రంగానే వుంటాయి. సాధారణమైన పూజలకు ఇవి పూర్తిగా విరుద్ధంగా వుంటాయి. వాటికి ఎంతో నియమ నిష్ఠలు పాటించాలంటారు. సుబ్బారెడ్డి ఇంట జరిగిన అఘోరాల పూజలు మొత్తం మీద టాక్ ఆఫ్ ద స్టేట్ అయ్యాయి.