అగ్ని పథ్ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్టు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ శుక్రవారం అన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఆందోళనకారులు ఎలాంటి విధ్వంసాలకు దిగవద్దని ఆయన కోరారు.
ఓ సైనికుడు మొదటగా దేశ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తాడని ఆయన పేర్కొన్నారు. దేశ ఆస్తులను ధ్వంసం చేస్తూ డిమాండ్లను నెరవేర్చుకోవాలనుకోవడం అనైతికమని ఆయన అన్నారు.
యువకుల ఆందోళనను సరైన వేదికలో వినిపించడానికి తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో అగ్నిపథ్ పై ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.
‘ ఈ విజ్ఞప్తిని మీ సోదరుని నుంచి వచ్చిందిగా భావించండి. క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు చర్చల ద్వారా దొరుకుతాయి. మీరే దేశ భవిష్యత్తు, అందుకే మీ నుండి దేశం చాలా ఆశిస్తోంది. మీ డిమాండ్లను వినిపించేందుకు నేను అన్ని విధాలా ప్రయత్నిస్తాను’ అని ట్వీట్ చేశారు.