అగ్నిపథ్‌పై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి. పలు చోట్ల ఆందోళనకారులు విధ్వంసానికి దిగుతున్నారు. ఇది ఇలా ఉంటే పంజాబ్ లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
పంజాబ్‌లో ఉపఎన్నికల్లో భాగంగా సంగ్రూర్ లో ర్యాలీని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సీఎం భగవంత్ సింగ్ మాన్ తన కారులో రూఫ్ టాప్ నుంచి నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు.
ఇంతలో సీఎంను చూసి ఓ యువకుడు అగ్నిపథ్ వ్యతిరేక నినాదాలు చేశాడు. దీంతో అతన్ని గమనించిన ముఖ్యమంత్రి మాన్ వెంటనే తాను కాన్వాయ్ ను ఆపాడు.
దీంతో యువకుడు ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి… అగ్నిపథ్‌ను అమలు చేయడానికి ముందే దానిపై నాయకులంతా చర్చించాలని కోరాడు. దీంతో ఒక వేళ ఎంపీలు అలాంటి సమావేశాన్ని నిర్వహిస్తే దానికి తానే స్వయంగా హాజరవుతానని యువకుడికి ఆయన హామీ ఇచ్చారు.
దీనికి సంబంధించిన వీడియోను ఆప్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అందుకే కదా ముఖ్యమంత్రి మాన్‌ను అందరూ ఇష్టపడేది అంటూ దానికి క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.