అగ్నిపథ్‌పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్, యూపీ, , హర్యానా, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఆర్మీ ఆశావహులు, యువత ఆందోళన బాట పడుతున్నారు. ముఖ్యంగా బీహార్ లో పలు రైళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
ఇది ఇలా ఉండగా అగ్నిపథ్ పథకంపై రక్షణ శాఖ మంత్రి వరుసగా రెండో రోజూ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. అగ్నిపథ్ పై ఆందోళనల గురించి ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం. నేటి సమావేశంలో అగ్నిపథ్ లో మరిన్ని మార్పులు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అగ్నిపథ్ పథకంపై శనివారం కూడా సమీక్ష నిర్వహించారు. అగ్నివీరులకు ఈ పథకం కింద ఉన్న రెండేండ్ల వయో సడలింపును మరో ఐదేండ్లు పెంచాచరు. దీంతో మొత్తం 7 ఏండ్ల వరకు వయోపరిమితిని పెంచారు.
దీంతో పాటు కేంద్ర సాయుధ బలగాల్లోని అసోం రైఫిల్స్, సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్ఎఫ్),సీఐఎస్ఎఫ్ సహా ఇతర దళాల్లో అగ్నివీరులు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. దీంతో పాటు మూడేళ్లు వయోపరిమితిని అగ్నివీరులకు పెంచారు.