కేంద్రంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫైర్ అయ్యారు. అగ్నిపథ్ పథకంపై ఆందోళనల నేపథ్యంలో కేంద్రంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఆర్మీ ఉద్యోగార్థులకు తాము మద్దతుగా నిలుస్తామని తెలిపారు.
ఈ వివాదాస్పద పథకాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్రంపై తాము ఒత్తిడి తీసుకు వస్తామని ఆమె చెప్పారు. ఈ పథకానికి ఓ విధానమంటూ లేదని ఆమె ధ్వజమెత్తారు.
ఆర్మీ ఉద్యోగార్థుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండానే హడావుడిగా ఈ పథకాన్ని కేంద్రం తీసుకు వచ్చిందన్నారు. వారి మాటలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాను నిరాశ చెందినట్టు చెప్పారు.
Advertisements
కేంద్రం తీసుకు వచ్చిన ఈ నూతన స్కీం పై మాజీ సైనికోద్యోగులు కూడా ప్రశ్నలు సంధిస్తున్నట్టు ఆమె అన్నారు. ఈ మేరకు ఆమె చేసిన ప్రకటనను కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.