కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసాయి. రైతుల శాంతియుతంగా చేస్తున్న నిరసనలపై హర్యానాలో మనోహర్‌లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. బదులుగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌నే రైతులకు అవాస్తవాలు నూరిపోస్తూ కేంద్రంపై ఉసిగొల్పుతున్నారని హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేపట్టేందుకు ఉదయం పంజాబ్ రైతులు భారీ సంఖ్యలో ఢిల్లీకి ర్యాలీగా బయల్దేరారు. కానీ రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మనోహర్ లాల్ కట్టర్ సర్కార్ కావాలనే రైతులను అడ్డుకున్నదని అమరీందర్‌సింగ్ ఆరోపించారు. దీనిపై కట్టర్ అమరీందర్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు.
మోదీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలతో మద్దతు ధరకు ఎలాంటి సమస్య ఉండదని అలాంటి సమస్య ఏదైనా ఉత్పన్నమైతే తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని కట్టర్ ఛాలెంజ్ చేశారు. వ్యవసాయ చట్టాలపై అబద్దపు ప్రచారం చేస్తూ అనవసరంగా రైతులను ఉసిగొల్పడం మానుకోమంటూ అమరీందర్ సింగ్‌కు హితవు పలికారు. దీనికి అమరీందర్ సింగ్ తిరిగి బదులిచ్చారు.
మద్దతు ధరలపై ఎలాంటి ఆందోళన వద్దని కన్విన్స్ చేయడం కాదు.. రైతులని చేయండి అని కౌంటర్ ఇచ్చారు. మీరు చెప్పేదే నిజమైతే ఈ ధర్నాలో హర్యానా రైతులు కూడా ఎందుకు పాల్గొంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
#WATCH Haryana: Police use water cannons & tear gas shells to disperse protesting farmers headed to Delhi as they tried to break through police barricades at Sadopur border in Ambala pic.twitter.com/M22Wi6rblE
— ANI (@ANI) November 26, 2020