గుంటూరు: మార్కెట్లో ఉల్లిపాయలు రేట్లు రోెజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఉల్లిపాయలు నిత్యావసరం. ఉల్లిపాయ వేయనిదే తెలుగిళ్లలో కూరే కాదు. సామాన్యుడి మొదలు సంపన్నుల వరకు నిత్యావసర సరుకుల జాబితాలో ఉల్లిపాయలు మస్ట్ ! ఉల్లి ధరలు పెరిగి సామాన్యులు గగ్గోలు పెడుతుండటం చూసి సర్కార్ కదిలింది. ఉల్లిని బ్లాక్ మార్కెట్కు తరలిస్తే సహించేది లేదని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు వార్నింగిచ్చారు. ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు. అక్రమంగా ఉల్లిని నిల్వ చేస్తే చర్యలు తప్పవుని అంటూ, రైతు బజార్ల ద్వారా ఉల్లిని తక్కువ ధరకే విక్రయించేందుకు ప్రభుత్వ ఆలోచన చేస్తోందని చెప్పారు.