తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బేసిక్‌గా ఒక విషయాన్ని మరచిపోయి మాట్లాడుతున్నాడు. యూరియా బస్తాలు పోర్టులో వుంటే కొరత లేనట్టు కాదు. అవి విశాఖ పోర్టు నుంచి తెలంగాణ జిల్లాలకు వచ్చి నేరుగా రైతులకు అంది.. అక్కడి నుంచి పొలాలకు చేరితే అప్పుడు కొరత లేదని జనానికి అర్ధం అవుతుంది. మంత్రివర్యా.. ఈ లాజిక్ మిస్సయితే ఎలా?
విశాఖ: తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. కానీ లేదని చెప్పడం కోసం తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి విశాఖ గంగవరం పోర్టుకు పరుగెత్తాల్సి వచ్చింది. గంగవరం పోర్టులో వియత్నాం నుంచి దిగుమతి చేసుకున్న యూరియాను మంత్రి పరిశీలించి వెంటనే తెలంగాణకు పంపించాలని పోర్టు సీఈఓ సాంబశివరావును అడిగి వచ్చారు. అంతా బానే వుంది. అక్కడే ప్రతిపక్షాలకు కాలిపోయే ఓ మాట అనేశాడు నిరంజన్‌రెడ్డి. తెలంగాణలో ప్రతిపక్షాలు కావాలనే యూరియా కొరత ఉందని రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి కామెంట్. యూరియా కొరత లేదని తెలియజెప్పేందుకు తాను విశాఖ దాకా రావాల్సి వచ్చిందని మంత్రి వివరణ. మరి కొరత లేకుంటే ఈ పర్యటన ఎందుకో మరి..!