భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండలో భారీ అవినీతి తిమింగళం ఏసీబీకి దొరికింది. మండల వ్యవసాయ అధికారిగా పని చేస్తున్న మహేష్ ఛటర్జీ లంచాలు రుచిమరిగి… ఎరువుల దుకాణాల యజమానులను వేధిస్తున్నాడు. ఏకంగా ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నాడు.
తాను తనిఖీలు చేయకుండా ఉండాలంటే ప్రతీ నెలా రూ.15వేల చొప్పున లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరకు కొందరు యజమానులు ఏసీబీని ఆశ్రయించారు. అధికారుల సలహా మేరకు ఆరు దుకాణాలకు సంబంధించిన రూ.90వేలు తీసుకోడానికి రావాలంటూ వల పన్నారు. అనుకున్నట్లుగా మహేష్ ఛటర్జీ వచ్చి సొమ్ము తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అశ్వారావుపేటలోని అతడి ఇంటిలోనూ సోదాలు నిర్వహించారు అధికారులు. ఏవోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.