వ్యవసాయంపై కెసిఆర్ మొన్నటి ప్రెస్ మీట్ లో సుదీర్ఘంగా ప్రసంగించారు .ప్రధానంగా తెలంగాణ వ్యవసాయంలో దేశంలోనే నంబర్ వన్ లో ఉందని, ప్రపంచానికే అన్నం పెట్టే పరిస్థితిలో ఉన్నామన్నారు. రైతు ప్రోత్సహకాల విషయంలోదేశంలోని ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలు ఒక్క తెలంగాణ మాత్రమే ప్రవేశ పెట్టిందన్నారు .నియంత్రిత వ్యవసాయం పేరుతో రైతులకు పలు సూచనలు చేశారు .
వీటిపై వ్యవసాయరంగ నిపుణులు, సిపిఎం సీనియర్ నాయకులు మల్లారెడ్డి తొలివెలుగు ఇంటర్వ్యూలో స్పందించారు . కెసిఆర్ వ్యవసాయంపై కెసిఆర్ మాట్లాడిన అంశాలు పచ్చి అబద్దాలన్నారు.రైతులకు ప్రోత్సహకాలు కెసిఆర్ ఒక్కడే ఇవ్వట్లేదన్నారు .తెలంగాణాలో నియంత్రిత వ్యవసాయం సాధ్యం కాదన్నారు . అది జరగాలంటే ముందుగా చాలా రకాల చర్యలు అవసరమని గుర్తు చేశారు. కెసిఆర్ చెప్పిన విషయాల్లో వాస్తవాలు లేవని ఉదాహారణలతో సహా చెప్పారు . వ్యవసాయ రంగ నిపుణులు మల్లారెడ్డి ప్రభుత్వానికి చేస్తున్న సూచనలు కింది వీడియోలో చూద్దాం .