టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలివిగా ఆలోచిస్తున్నాడు. ఆహా పేరుతో ఓటీటీని తీసుకొచ్చిన ఆయన.. దాన్ని ఆడియన్స్ కు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీ కోసం సరికొత్త ప్రోగ్రామ్లకు రూపకల్పన చేస్తున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ బ్యూటీ సమంతతో శామ్ జామ్ పేరుతో ఓ ప్రోగ్రాంను సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. ప్రస్తుతం అన్‌స్టాపబుల్ టాక్ షోతో ఆహాలో బాలకృష్ణ హోస్టుగా పెట్టి అదరగొడుతున్నారు.
ఈ ప్రోగ్రాం కు అనూహ్యమైన స్పందన వచ్చింది. అలాగే ఓటీటీ సబ్స్క్రైబర్ల సంఖ్య కూడా భారీగా పెరిగిందని తెలుస్తోంది. ఇదే స్ఫూర్తితో అల్లు అరవింద్ ఆహా కోసం ఓ సరికొత్త ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నాడట.
దీనికి వెంకటేశ్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో రానుందట. వెంకీతో ఎలాంటి ప్రోగ్రాం చేయించబోతున్నాడో చూడాలి మరి.