ప్రముఖ ఓటిటి సంస్థ ఆహ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఫ్యాన్సీ ధరకు ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో ఆహ తన మార్కెట్ ను పెంచుకోటానికి కూడా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీ పెద్ద సినిమాలను భారీ ధరలకు కొనుగోలు చేస్తుంది.
రవితేజ నటించిన క్రాక్, నాగ చైతన్య సాయి పల్లవిల లవ్ స్టోరీ, అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి పెద్ద చిత్రాలను ఆహ ఇటీవల కొనుగోలు చేసింది.
ఇప్పుడు భీమ్లా నాయక్ ను కొనుగోలు చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్‌కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.