స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఇటీవల పుష్ప సినిమా తో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ఇక ఓటిటి లో కూడా ఈ చిత్రం రిలీజ్ అయ్యి మంచి వ్యూస్ ను అందుకుంది.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ఓటిటి సంస్థ ఆహా కోసం ఇప్పటివరకు ఎన్నో ప్రమోషన్స్ చేశారు. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా ఆయనే ఓ టాక్ షో చేయబోతున్నారట.
ఇప్పటికే టాక్ షో షూట్ స్టార్ట్ అయ్యిందట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ త్వరలో పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో మెయిన్ విలన్ గా ఫహద్ ఫాసిల్ నటించబోతున్నారు.