భారత్ కు పెద్ద ఎత్తున బంగారం సరఫరా చేసే బ్యాంకులు పండుగల సీజన్‌కు ముందు తమ నిర్ణయాన్ని మార్చుకున్నాయి. ఈ సారి భారత్‌కు బదులుగా ఎక్కువ ప్రీమియంలు అందించే చైనా, టర్కీ, ఇతర మార్కెట్లపై ఆయా బ్యాంకులు దృష్టి సారించాయి.
దీంతో ప్రపంచంలోనే అత్యంత రెండవ అతిపెద్ద బంగారం మార్కెట్ అయిన భారత్‌లో కొరత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా సరఫరాదారులకు కొనుగోలు దారులు అధిక మొత్తంలో ప్రీమియంలు చెల్లించాల్సి వస్తుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
భారత్ కు ప్రధాన బంగారు సరఫరాదారులైన ఐసీబీఐ స్టాండర్డ్ బ్యాంక్, జేపీ మోర్గాన్, స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంకులు సాధారణంగా పండుగలకు ముందు భారీగా బంగారాన్ని దిగుమతి చేస్తూ ఉంటాయి. వాటిని వాల్ట్ లలో నిల్వ చేస్తూ ఉంటాయి.
ఏడాది క్రితం నిల్వలతో చూస్తే ఇప్పుడు వాల్ట్ లలో 10శాతం కన్నా తక్కువగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ పండుగ సీజన్ సమయంలో సాధారణంగా వాల్ట్ లలో టన్నుల కొద్ది బంగారం ఉంటుందని, కానీ ఈ సారి కేవలం కిలోల్లో మాత్రమే ఉందని మార్గెట్ వర్గాలు చెప్పాయి. దీనిపై స్పందించేందుకు ఐసీబీసీ, స్టాండర్ట్ చార్టెడ్ బ్యాంక్, జేపీ మోర్గాన్ బ్యాంకులు స్పందించేందుకు నిరాకరించాయి.
భారత్‌లో అంతర్జాతీయ బంగారం ధర బెంచ్ మార్క్‌పై ప్రీమియంలు ఔన్స్‌కి 1-2 డాలర్లకి పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి దాదాపు అది 4 డాలర్లకి పడిపోయింది. అయితే బ్యాంకులు ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడ బంగారాన్ని విక్రయిస్తూ ఉంటాయని నిపుణులు అంటున్నారు.
చైనా, టర్కీలో కొనుగోలు దారులు ప్రస్తుతం చాలా ఎక్కువ ప్రీమియం చెల్లిస్తున్నట్టు బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ మార్కెట్‌తో పోల్చినప్పుడు అధి చాలా అధికంగా ఉంటున్నట్టు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో భారత్ లో బంగారం దిగుమతులు తగ్గాయి.
గతేడాది నుంచి చూస్తే భారత్ లో సెప్టెంబర్ లో బంగారం దిగుమతులు 30 శాతం తగ్గి 68 టన్నులకు చేరుకుంది. అదే సమయంలో టర్కీలో బంగారం దిగుమతులు 543 శాతం పెరిగాయి. హాంకాంగ్ ద్వారా చైనా నికర బంగారం దిగుమతులు ఆగస్ట్‌లో దాదాపు 40శాతం పెరిగి నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
భారత్‌లో దసరా, దీపావళి సందర్బాల్లో బంగారం విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఈ సారి వాల్ట్ లలో నిల్వలు తక్కువగా ఉండటంతో దిగుమతుల కోసం సరఫరా దారులకు కొనుగోలు దారులు అధిక పీమియంలు చెల్లించాల్సి వుంటుంది. తద్వార బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు.