పాటిదార్ సామాజిక నేత, కాంగ్రెస్ మాజీ నాయకుడు హార్దిక్ పటేల్ గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర రాజధాని గాంధీనగర్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి నేతలు ఆహ్వానించారు.
మరో కొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పటేల్ రాకతో బీజేపీ బలం మరింత పెరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
పార్టీలో చేరే ముందు గురువారం ఉదయం ఆయన ఓ ట్వీట్ చేశారు. దేశ, రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నట్టు ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు.
ప్రజల, సామాజిక ప్రయోజనాలే తన ప్రధాన ఎజెండా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర భాయ్ మోడీ నాయకత్వంలో దేశ సేవలో తాను చిన్న సైనికుడిగా పనిచేస్తానని ఆయన వెల్లడించారు.