తేజ దర్శకత్వంలో, అభిరామ్ దగ్గుబాటి హీరోగా పరిచయమౌతున్న సినిమా అహింస. యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇప్పటికే విడుదలైన ‘అహింస’ ఫస్ట్ లుక్, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ‘నీతోనే నీతోనే’, ‘కమ్మగుంటదే’ పాటలు హిట్స్ గా నిలిచాయి.
తాజాగా మేకర్స్ ‘అహింస’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలవ్వనుంది ఈ మూవీ. అంతా బాగానే ఉంది కానీ, ఈ రిలీజ్ టైమింగ్ పై అనుమానాలు రేగుతున్నాయి. ఏప్రిల్ 7న ఆల్రెడీ రావణాసుర, మీటర్ లాంటి సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. మరోవైపు ఆ తేదీకి ముందు, వెనుక కూడా పెద్ద సినిమాలున్నాయి.
ఇలాంటి టైమ్ లో అభిరామ్ లాంటి కొత్త హీరో నటించిన సినిమాను విడుదల చేయాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. పైగా అల్లాటప్పా హీరో సినిమా కాదిది. దగ్గుబాటి కాంపౌండ్ నుంచి మరో నటవారసుడు హీరోగా పరిచయమౌతున్న సినిమా. ఇలాంటి మూవీని సరైన టైమింగ్ చూసుకోకుండా రిలీజ్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.