గుజరాత్‌లో మెట్రో రైలుపై గ్రాఫిటీ పెయింటింగ్ (హాస్యం లేదా విమర్శల కోసం వేసే పెయింటింగ్స్) వేసినందుకు నలుగురు ఇటాలియన్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అహ్మదాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు మొదటి ఫేజ్ ను ప్రధాని మోడీ ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు నలుగురు ఇటాలియన్లు మెట్రో రైల్ పై గ్రాఫిటీ పెయింటింగ్స్ వేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
దీంతో మెట్రో స్టేషన్ లోకి అక్రమంగా చొరబడినందుకు, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించినందుకు పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులను కుడిని జియానుల్కా(24), బాల్డో సాచా(29), స్టారినియారీ డేనియల్(21), క్యాపెకి పావోలోలుగా గుర్తించారు.
ఆ నలుగురు నిందితులు అపరెల్ పార్క్ మెట్రో స్టేషన్ లోకి అక్రమంగా చొరబడినట్టు పోలీసులు తెలిపారు. దాంతో పాటు మెట్రో రైలు కోచ్ పై ఇటాలియన్ బాషలో పెయింట్ తో ఏదో రాసినట్టు పోలీసులు వెల్లడించారు. దీంతో మెట్రోకు రూ. లక్ష వరకు నష్టం జరిగినట్టు అధికారులు వెల్లడించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వేట మొదలు పెట్టారు. చివరకు పల్దీ ప్రాంతంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదంతా వారు కేవల సరదా కోసమే చేశారని విచారణలో తేలినట్టు పోలీసులు వెల్లడించారు.
కొంత మంది గ్రాఫిటీ ఆర్టిస్టులు ఇలా ప్రపంచ వ్యాప్తంగా పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇలా పలు ప్రాంతాల్లో గ్రాఫిటీ పెయింటింగ్ వేస్తుంటారని పోలీసులు తెలిపారు. ఆ ఆర్టిస్టుల బృందంలో వీరు