ఎటూ పాలుపోని స్థితిలో.. అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ పీసీసీకి ఓ కొత్త దిశా నిర్దేశం చేయడానికా అన్నట్టు ఏఐసీసీ ఇన్-ఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే బుధవారం హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణాలో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గాంధీభవన్ లో ఉదయం పదిన్నర గంటల నుంచి ఆయన పార్టీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు.
తొలుత ఇన్-ఛార్జ్ ఏఐసీసీ కార్యదర్శులతో .. ఆతరువాత పీసీసీ అధ్యక్షులు, సిఎల్ఫీ నేత, పీఏసీ సభ్యులతో వ్యక్తిగతంగా సమావేశం కానున్నారు. రాత్రి 7 గంటలకు పీఏసీ సభ్యుల సమావేశంలోనూ ఆయన పాల్గొననున్నారు. గురువారం డీసీసీలు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్లు, అధికార ప్రతినిధులతో ఠాక్రే భేటీ కానున్నారు.
పార్టీలో సీనియర్లు, జూనియర్ నేతల మధ్య ‘టగ్ ఆఫ్ వార్’ ని ఆయన ఎలా పరిష్కరిస్తారన్నది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. రాజీనామా లేఖ్లతో భయపెట్టిన సీనియర్లను ఆయన ఎలా బుజ్జగిస్తారన్నది కూడా తేలవలసి ఉంది.
మాణిక్కం ఠాకూర్ తో కాని పని ఈయన అవలీలగా సాల్వ్ చేయగలరన్న నమ్మకంతో పార్టీ అధిష్టానం ఆయనను పంపింది.