ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు.
గాంధీ భవన్‌లో ఉదయం 10.30 గంటల నుంచిఠాక్రే వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. ముందుగా ఇంఛార్జ్ ఏఐసీసీ కార్యదర్శులతో ఠాక్రే సమావేశం నిర్వహించనున్నారు.
తరువాత పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేత, పీఏసీ సభ్యులతో ఆయన వ్యక్తిగతంగా భేటీ కానున్నారు. రాత్రి 7 గంటలకు పీఏసీ సభ్యులతో సమావేశం కానున్నారు.
గురువారం డీసీసీలు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల ఛైర్మన్‌లు, అధికార ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు.