ఈ నెల 26 నుంచి రెండు నెలలు ప్రతీ నియోజకవర్గంలో పాదయాత్ర చేయాలని ఏఐసీసీ ఆదేశించినట్టు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. రెండు నెలల పాదయాత్ర ముగిసన తర్వాత రాష్ట్ర రాజధానిలో జాతీయ ,రాష్ట్ర నాయకత్వాలు పాదయాత్ర చేస్తారని చెప్పారు.
రాష్ట్ర పీసీసీ చీఫ్, రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఏఐసీసీ ఇచ్చిన సర్క్యులర్‌ను అందరి డీసీసీలకు పంపిస్తామన్నారు. పీసీసీ తరుఫున ప్రతీ నియోజకవర్గం నుంచి ఇద్దరు పరిశీలకులను నియమిస్తామన్నారు. తనకు ఏఐసీసీ నుంచి సర్క్యులర్ సమాచారం మాత్రమే ఉందన్నారు.
రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర సమాచారం తమకు లేదన్నారు. రేపటి అవగాహన సదస్సుపై తనకు సమాచారం లేదన్నారు. కాంగ్రెస్‌లో రెగ్యులర్‌గా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. రేపటి అవగాహనా సదస్సు ఏఐసీసీ కార్యక్రమమని తాను అనుకోవడం లేదన్నారు.
ఏఐసీసీ ఇచ్చే ప్రతి ఆదేశాన్ని పాటిస్తామన్నారు. పీసీసీ రాష్ట్ర స్థాయి పాదయాత్ర విషయం తనకు తెలియదన్నారు.
పీసీసీ పాదయాత్రకు ఏఐసీసీ అనుమతి ఇస్తే తాను ముందు ఉండి పాల్గొంటానన్నారు. పార్టీలో ఎవరు పాదయాత్ర చేయాలన్నా ఏఐసీసీ అనుమతి అవసరముంటుందన్నారు. ఏఐసీసీ అనుమతి ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు.