కాంగ్రెస్ అగ్ర నేతలకు, రాష్ట్ర నేతలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ఇంట్లో అల్పాహర విందు ఇచ్చారు. బ్రేక్ పాస్ట్ పూర్తైన తర్వాత, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ఏర్పాట్లపై చర్చించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సమావేశం పూర్తైన తర్వాత రాత్రికి కాంగ్రెస్ నేతలు ఇక్కడే ఉన్నారు.
బుధవారం ఉదయం జైరామ్ రమేష్, దిగ్విజయ్ సింగ్ లతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో అల్పాహర విందు ఆరగించారు. బ్రేక్ పాస్ట్ పూర్తైన తర్వాత రాష్ట్రంలో భారత్ జోడో యాత్రపై చర్చించారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ యాత్రను విజయవంతం చేసే విషయమై చర్చించారు.
ఈ అల్పాహార విందులో ఏఐసీసీ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ కేవీపీ రామచందర్ రావు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నిక, తెరాస జాతీయ పార్టీ ప్రకటనలకు చెంది చర్చకు వచ్చినట్లు
తెలుస్తోంది. దాదాపు గంటపాటు ఈ అల్పాహార విందు సమావేశం జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా ఈ నెల 24వ తేదీన భారత్ జోడో యాత్రం కర్ణాటక నుండి తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి కొనసాగనుంది. రాష్ట్రంలోని జడ్చర్ల, షాద్‌నగర్, శంషాబాద్, ఆరంఘర్, చార్మినార్, ఎంజే మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, విజయనగర్ కాలనీ, మాసబ్‌ట్యాంక్, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెరు, ముత్తంగి, సంగారెడ్డి ఎక్స్ రోడ్డు, జోగిపేట, శంకరంపేట్, మదనూర్‌ల గుండా యాత్ర సాగనుంది. అనంతరం తెలంగాణ నుండి మహరాష్ట్రలోకి పాదయాత్ర ప్రవేశించనుంది.